గ్రేటర్ ఎన్నికల్లో పోటా పోటీ ప్రచారం

ఈసారి మేయర్ సీటు ఓసీ జనరల్‌కు కేటాయిం చారు. దీంతో పోటీ మరింత పెరిగింది. మిగతా పార్టీలు మేయర్ అభ్యర్థిని ప్రకటించినా కాంగ్రెస్ పార్టీ ప్రకటించలేదు. ఈ క్రమంలో ఆ పార్టీ నుంచి మేయర్ పీఠాన్ని ఆశిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. టికెట్ల బెడద, తిరుబాటు అభ్యర్ధుల రగడ కారణంగా కాంగ్రెస్ లో కొంత గంద్రగోళం నెలకొంది. అయినా వంద స్ధానాలను ఆ పార్టీ టార్గెట్ గా పెట్టుకుంది.
వివిధ పార్టీల ప్రధాన నాయకుల ప్రసంగాలు ఇలా ఉన్నాయి:
కాంగ్రెస్ నాయకులు ప్రధానంగా సోనియా, వైఎస్ ల పేర్లు చెప్పుకుని ప్రచారం చేస్తున్నారు. వారికి పటిష్టమైన ఎన్నికల ప్రణాళిక ఉన్నట్టు కన్పించడం లేదు. నాయకులు ఎవరి ధోరణిలో వారు ప్రచారం చేసుకుంటూ పోతున్నారు.
కాంగ్రెస్ ను దొంగల, రౌడీల పార్టీగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు విమర్శిస్తున్నారు. కాలనీల్లో ఆయన ప్రసంగాలకు మంచి స్పందన కనిపిస్తోంది. తన హయాంలో రౌడీలంతా నగరం నుంచి పారిపోయారని, ఇప్పుడు మళ్ళీ తయారయ్యారని ఆయన అంటున్నారు.
విద్యావంతులు, సేవాతత్పరులైన యువ అభ్యర్థులకు గ్రేటర్ ఎన్నికల్లో ఓట్లు వేసి, గెలిపించాలని పీఆర్పీ అధినేత చిరంజీవి ప్రజలకు పిలుపునిస్తున్నారు. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శిస్తున్నారు. వాటి పరిష్కారానికి సూర్యుని గుర్తుపై ఓటు వేయడం ఒక్కటే మార్గమన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా యువత తమకు అండగా నిలవడం తమ అదృష్టమన్నారు.
లోక్ సత్తా ఎప్పటిలాగానే డబ్బు, కులం లేని రాజకీయాల వాణి వినిపిస్తోంది. సంస్కరణలు, స్వచ్చమైన పాలనను లక్ష్యంగా పెట్టుకుంది. మంచి పాలన కోసం ఎన్నికల్లో లోక్ సత్తాను ఆదరించాలని ఆ పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ కోరుతున్నారు. టీడీపీ, కాంగ్రెస్ లాంటి పార్టీలు ఎన్నికల్లో గెలవడానికి డబ్బు, మద్యం పంచుతున్నారన్నారు. ప్రజలకు అధికారం ఇవ్వాలన్న అజెండాతోనే లోక్ సత్తా గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తోందన్నారు.












Click it and Unblock the Notifications