కోటి దాకా మధు కొడా అస్తులు

ఈ ఆస్తులను మధు కొడా స్వయంగా 2005 శాసనసభ ఎన్నికల సమయంలో, 2009 లోకసభ ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్ కు సమర్పించిన అఫిడవిట్ లో చెప్పారు. ఈ రెండు సమయాల్లోనూ ఆయన గెలిచారు. 2005లో జగన్నాథపురం నుంచి, ఈ ఏడాది స్వతంత్ర సభ్యుడిగా గెలిచారు. టాటా స్టీల్, రిలయన్స్ పెట్రోలియం, ఎస్బీఐ వంటి బ్లూ చిప్ కంపెనీల్లో ఆయన వాటాలు కొనుగోలు చేసినట్లు ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ ద్వారా తెలుస్తోంది.
2005లో ఆయనకు 1.5 లక్షల రూపాయల విలువ చేసే ఆభరణాలు ఉంటే అవి 2009 నాటికి 37 లక్షల రూపాయలకు చేరుకున్నాయి. వ్యవసాయ భూముల విలువ ఇదే కాలంలో 1.1 లక్షల రూపాయల నుంచి 4.2 లక్షల రూపాయలకు చేరుకున్నాయి. తాను పేద గిరిజనుడినని మధు కొడా ఇటీవల అన్నారు. బ్యాంక్ డిపాజిట్లు, బాండ్లు, వాటాలు, ఇతర పొదుపులు, రెండు కార్లు, ఆభరణాలు, భూములు ఈ 94 లక్షల రూపాయల ఆస్తుల్లో ఇమిడి ఉన్నాయి.
ఈ ఆస్తులన్నీ దాదాపు మధు కొడా పేరు మీదనే ఉన్నాయి. కొన్ని నగదు డిపాజిట్లు, భూములు, ఆభరణాలు ఆయన భార్య గీత, కూతురు దర్శిని నాగి పేర్ల మీద ఉన్నాయి. కూలీ స్థాయి నుంచి మధుకొడా రాష్ట్ర ముఖ్యమత్రి స్థాయికి ఎదిగారు.












Click it and Unblock the Notifications