రాహుల్ వెంట పడిన వరుణుడు

తిరుపతిలో ఆయన రెండు విశ్వవిద్యాలయ విద్యార్థులతో ఇష్టాగోష్ఠిలో పాల్గొనాల్సి ఉండింది. అయితే భారీ వర్షం కారణంగా ఆయన తిరుపతిలో దిగలేదు. అదే విమానంలో ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రాహుల్ గాంధీని కలుసుకోవడానికి తిరుపతి వెళ్లిన ముఖ్యమంత్రి కె.రోశయ్య రాహుల్ గాంధీ వెళ్లిపోయారని తెలుసుకుని తిరుమలకు చేరుకున్నారు. రాహుల్ గాంధీ బుధవారంనాడు వరంగల్ లోని జాతీయ అథ్లెటిక్ పోటీల కార్యక్రమంలో కూడా పాల్గొనాల్సి ఉండింది. అయితే వర్షం కారణంగానే ఆయన వరంగల్ పర్యటనను రద్దు చేసుకున్నారు.












Click it and Unblock the Notifications