'గాలి'ఉల్లంఘనలు నిజమే: కమిటీ

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అటవీ సంరక్షణ నిబంధనలను ఉల్లంఘించిందని సాధికారిక కమిటీ అభిప్రాయపడింది. తవ్వకాల్లో ధ్వంసమైన జిటి స్టేషన్ ను, సుంకులాంబ ఆలయాన్ని పునరుద్ధరించాలని సాధికారిక కమిటీ అభిప్రాయపడింది. ఓబుళాపురం మైనింగ్ కంపెనీతో పాటు ఇతర మైనింగ్ కంపెనీలు లీజు పొందిన ప్రాంతాల హద్దుల నిర్ధారించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన రెవెన్యూ, అటవీ, పర్యావరణ, గనుల శాఖల సీనియర్ అధికారులతో కమిటీ వేయాలని సిఫార్సు చేసింది. అంత వరకు తవ్వకాలను ఆపించాలని, తవ్విన ఇనుప ఖనిజం రవాణాను ఆపాలని, దాన్ని సీజ్ చేయాలని సూచించింది. అక్రమాలు నిజమని తేలితే లీజులు రద్దు చేయాలని సూచించింది.












Click it and Unblock the Notifications