రూటు మార్చిన కొడాలి నాని - పార్టీ నేతలతో భేటీ, కీలక నిర్ణయం..!!

గుడివాడ కేంద్రంగా రాజకీయ లెక్కలు మారుతున్నాయి. 2029 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ గెలుపు తరువాత కొడాలి నాని కొంత సైలెంట్ అయ్యారు. ఆరోగ్య పరమైన సమస్యలతో దాదాపు రెండేళ్ల కాలం నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. అప్పుడప్పుడూ పార్టీ సమావేశాల్లో మినహా యాక్టివ్ గా లేరు. తొలుత 2029 ఎన్నికల్లోనే తన వారసుడు పోటీ చేస్తారని చెప్పినా.. నిర్ణయం మారింది. తన వారసుడిని ప్రకటించారు. కాగా, కొడాలి నాని 2029 లక్ష్యంగా కొత్త రూట్ ఫిక్స్ చేసారు.

ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని కొద్ది రోజులుగా గుడివాడలో నిర్వహిస్తున్న సమావేశాలు ఆసక్తి కరంగా మారాయి. 2024 ఎన్నికల్లో ఇక్కడ నాని ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో తన వారసుడిగా సోదరుడి కుమారుడు అర్జున్ ను ప్రకటించారు. ఎన్నికల్లో ఓడిన తరువాత చాలా రోజులు అనారోగ్య కారణాలతో నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. అయితే, జగన్ సూచన మేరకు వచ్చే ఎన్నికల్లో నాని గుడివాడ నుంచే తిరిగి పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. తన వారసుడిగా పరిచయం చేసిన అర్జున్ 2034 నుంచి పోటీ లో నిలుస్తారని ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. ఇదే సమయంలో నాని తిరిగి రాజకీయాల్లో మళ్లీ క్రియాశీలకం అయ్యారు. గుడివాడ రాజకీయాల్లో మళ్లీ తన మార్క్ పోరాటాలకు సిద్ధమవుతున్నారు.

 అసెంబ్లీకి జగన్, నిర్ణయం వెనుక- కీలక మంత్రాంగం..!!
అసెంబ్లీకి జగన్, నిర్ణయం వెనుక- కీలక మంత్రాంగం..!!
ysrcp-leader-kodali-nani-moving-with-new-strategies-in-gudiavada-ahead-local-body-elections-details

స్థానిక ఎన్నికల పై ఫోకస్

కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దం అవుతోంది. ముందుగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సమాయత్తం అవుతున్న సమయంలో.. మాజీ సీఎం జగన్ పార్టీ నేతలకు కీలక సూచనలు చేసారు. ప్రతీ వార్డులో వైసీపీ అభ్యర్ధి ఖచ్చితంగా పోటీలో ఉండాలని స్పష్టం చేసారు. దీంతో.. కొడాలి నాని వరుసగా పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కలసి పనిచేయాలని సూచించారు. కేసులు పెట్టి జైల్లో వేస్తే నెల లేదా ఆరు నెలలు ఉంటామని, తర్వాత బయటకు వస్తామని చెప్పుకొచ్చారు. గుడివాడ నియోజకవర్గంలో ఎక్కడా ఏకగ్రీవం కానివ్వబోమని ప్రకటించారు. అన్ని స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు పోటీ చేస్తారని కొడాలి నాని ప్రకటించారు. ఇదే సమయంలో తాను ఇక కార్యకర్తల చెంతనే ఉంటానని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. దీంతో.. స్థానిక ఎన్నికల్లో గుడివాడలో చోటు చేసుకునే పరిణామాలు.. ఫలితాల పైన రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+