విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విటిపిఎస్ లో అగ్ని ప్రమాదం

By Pratap
|
Google Oneindia TeluguNews

Narla Tatarao Thermal Power Station
విజయవాడ: విజయవాడలోని నార్ల తాతారావు థర్మల్ విద్యత్కేంద్రంలో మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో విటిపిఎస్ లోని ఏడో యూనిట్లో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. ట్రాన్స్ ఫార్మర్ లో మంటలు లేచాయి. రెండు రోజుల క్రితమే అధికారులు దీనికి మరమ్మతులు చేశారు. అయినా ఫలితం లేకపోయింది. ఈ విద్యుత్కేంద్రాన్ని 1950 కోట్ల వ్యయంతో 800 మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. ఈ కేంద్రంలో విద్యుదుత్పత్తి 500 మెగావాట్లకు చేరుకుంటే రాష్ట్రంలో కరెంట్ సమస్య తీరుపోతుంది.

ఈ కేంద్రానికి భూపాలపల్లి నుంచి ట్రాన్స్ ఫార్మర్లు వస్తున్నాయి. వీటిని బిహెచ్ఇఎల్ సరఫరా చేస్తోంది. బిహెచ్ఇఎల్ నాణ్యతను పాటించకపోవడం వల్లనే ఈ ప్రమాదాలు సంభవిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. గత నెల 26వ తేదీన కూడా అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుదుత్పత్తి 300 నుంచి 365 మెగావాట్లకు చేరుకుంటున్న సమయంలో కేంద్రంలో మంటలు లేస్తున్నాయి. ఈ ప్రమాదాల వల్ల ఇప్పటి వరకు 4 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు ఒక అంచనా. ప్రాజెక్టు వ్యయంతో పొల్చుకుంటే నష్టం ఎక్కువగా జరుగుతోంది. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X