రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహిళ అదృశ్యం: పోలీసులపై ఆగ్రహం

By Santaram
|
Google Oneindia TeluguNews

East Godavari
రాజమండ్రి: తన చెల్లెలి అదృశ్యంపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి మూడు నెలలవుతున్నా ఇంతవరకూ కేసులో పురోగతి లేదని మండపేట అరుంధతిపేటకు చెందిన వల్లూరి దొరకయ్య వాపోయారు. మండపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1986లో కపిలేశ్వరపురం మండలం నల్లూరుకు చెందిన జార్జిబాబుతో తన చెల్లెలు జయమేరీ సుశీలకు వివాహం జరిపించి అప్పట్లోనే కట్నకానులు ముట్టజెప్పామన్నారు.

ప్రస్తుతం వారికి 18 సంవత్సరాల కుమారుడు ఉన్నాడన్నారు. పెళ్లైనప్పటి నుంచి తన చెల్లెల్ని జార్జిబాబు చిత్రహింసలకు గురి చేస్తుండేవాడని ఈ క్రమంలో పలుమార్లు పెద్దలతో చెప్పించేవారమని అన్నారు. ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ కొన్ని సంవత్సరాలుగా కాకినాడలోని అన్నమ్మఘాటీ వద్ద నివాసముంటున్నారని, ఆగస్టు 19 నుంచి సుశీల కనిపించకపోవడంతో తన మేనల్లుడి ద్వారా సమాచారం తెలుసుకుని కాకినాడ పరిసరాల్లో గాలించినా ఫలితం లేకపోయిందని దొరకయ్య వాపోయారు.

దీనిపై అదే నెల 23న కాకినాడ ఒకటవ పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు. తన చెల్లెలిని బావే హత్య చేసి కనిపించకుండా మాయం చేసి ఉండవచ్చునని దొరకయ్య ఆరోపించారు. పోలీసులు కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందన్నారు. పోలీసులు ఇప్పటికైనా స్పందించి సమగ్ర విచారణ జరుపకుంటే తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తామని ఎంఆర్‌పీఎస్‌ నాయకులు హెచ్చరించారు. పది రోజుల్లోగా కేసు దర్యాప్తు చేయకపోతే ఎస్పీ కార్యాలయం ముందు ధర్నా చేస్తామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ఎస్సీ సెల్‌ నాయకులు మందపల్లి పనసాద్రి, ఎంఎస్‌వీ మునిప్రసాద్‌, ఎంఆర్‌పీఎస్‌ మండపేట నియోజకవర్గ ఇన్‌చార్జి ధూళి జయరాజు, పెందుర్తి ప్రసంగి, మందపల్లి సంజీవరావు పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X