నొప్పి తెలియకుండా జగన్ పై దెబ్బ

విజయలక్ష్మిని శాసనసభకు పోటీ దించడం సరైంది కాదని, ఆమెను అంతకన్నా పెద్ద పదవిలో చూడాలని ఉందని విజయవాడ పార్లమెంటు సభ్యుడు రాజగోపాల్ చేసిన వ్యాఖ్య వైయస్ శిబిరంలోని నైరాశ్యాన్ని బయటపెడుతోంది. సోనియా నిర్ణయానికి అంగీకరించక తప్పని పరిస్థితి కూడా జగన్ కు ఏర్పడింది. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అధినేత గాలి జనార్దన్ రెడ్డిపై చర్యలకు కూడా కాంగ్రెసు నాయకత్వంపై చొరవతోనే ఆచితూచి వ్యవహరించినట్లు కనిపిస్తోంది. గాలి జనార్దన్ రెడ్డిపై చర్యలు తీసుకోవడం ద్వారా జగన్ ఆదాయ మార్గానికి గండి పెట్టడం ఒక వ్యూహంగా కాంగ్రెసు నాయత్వం అమలు చేసినట్లు చెబుతున్నారు. ఒక వేళ జగన్ తిరుగుబాటు చేస్తే కాంగ్రెసు నాయకత్వం నుంచి ఎదుర్కోవాల్సిన సంక్లిష్టపరిస్థితిని కూడా జగన్ అంచనా వేసుకున్నట్లు చెబుతున్నారు. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడాపై బిగిస్తున్న ఉచ్చు, గాలి జనార్దన్ రెడ్డిపై చర్యలు జగన్ కు హెచ్చరికలలాంటివని అంటున్నారు. ఈ స్థితిలో జగన్ సోనియా మాటలను కాదనలేని పరిస్థితిని కల్పించినట్లు భావిస్తున్నారు.
జగన్ 2014 వరకు కూడా ముఖ్యమంత్రి పదవిపై ఆశ పెట్టుకోలేని పరిస్థితిని పార్టీ అధిష్టానం కల్పించింది. ఈ విషయాన్ని జగన్ కు సోనియా గాంధీ స్పష్టం చేసినట్లే అయింది. ప్రస్తుతం వివిధ కారణాల వల్ల జగన్ వైపు పార్టీ నాయకులే కాకుండా కార్యకర్తలు కూడా ఏదో మేరకు ఉన్నారు. జగన్ లాబీ లొల్లి చేయడం ద్వారా అధిష్టానంపై ఒత్తిడి తెచ్చే వ్యూహాన్ని అమలు చేసింది. అయితే, రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర లేకుండా, తన ఆదాయ మార్గాలను పెంచుకునే అవకాశం లేకుండా జగన్ తన వర్గాన్ని వచ్చే ఎన్నికల వరకు నిలుపుకోగలరా అనేది కూడా సందేహమే.
-
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
ఈ సాయంత్రం మోదీ అత్యవసర భేటీ- కఠిన నిర్ణయాల దిశగా కేంద్రం? -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్












Click it and Unblock the Notifications