విజ్ఞాన్‌ విద్యాసంస్ధల బస్సుకు నిప్పు

Vignan College Bus
హైదరాబాద్: టీఅర్ ఎస్ అధినేత కేసీఆర్‌ అరెస్టును నిరసిస్తూ టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఆదివారం అర్థరాత్రి రాష్ట్ర రాజధానిలో అనేక చోట్ల బస్సులను ధ్వంసం చేశారు. కర్మాన్‌ ఘాట్‌ క్రాస్‌రోడ్డు వద్ద విజ్ఞాన్‌ విద్యా సంస్థలకు చెందిన బస్సుకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. విజ్ఞాన్‌ విద్యా సంస్ధలు గుంటూరుకు చెందిన లావు రత్తయ్యవి కావడం గమనార్హం. రామచంద్రపురంలో మరో రెండు ఆర్టీసీ బస్సులను టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ధ్వంసం చేశారు.

సికింద్రాబాద్‌ వద్ద బంద్‌ హింసాత్మకంగా మారింది. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో లోకల్‌ ట్రయిన్‌ పైకి ఎక్కిన ఓ వ్యక్తి హెటెన్షన్‌ విద్యుత్‌ వైర్లు పట్టుకున్నాడు. దీంతో నిప్పు రవ్వలు చెలరేగటంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే బాధితుడిని అంబులెన్స్‌ ద్వారా ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని టీఆర్‌ఎస్‌ కార్యకర్తగా భావిస్తున్నారు. అలాగే సికింద్రాబాద్‌ వద్ద టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఆర్టీసీ బస్సు అద్దాలు పగులగొట్టారు. ఈ ఘటనలతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+