సోనియా నిర్ణయం శిరోధార్యం: మంత్రులు

Rosaiah
హైదరాబాద్: తెలంగాణపై తమ కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని మంత్రులు స్పష్టం చేశారు. సోమవారం ముఖ్యమంత్రి కె.రోశయ్య అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అరెస్టు నేపథ్యంలో తలెత్తిన శాంతిభద్రతల సమస్యపై మంత్రివర్గం చర్చించింది. ఈ సమావేశానికి పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) గిరీష్ కుమార్ కూడా హాజరయ్యారు. కెసిఆర్ నిరాహార దీక్ష తలపెట్టిన నేపథ్యంలో పోలీసులు తీసుకున్న చర్యలపై ఆయన మంత్రులకు వివరించారు. కెసిఆర్ ను ముందుగానే అరెస్టు చేసి, ఖమ్మం జైలుకు తరలించడం ద్వారా శాంతిభద్రతలను పరిరక్షించగలిగామని ఆయన చెప్పారు. కెసిఆర్ ను ఇప్పుడు వరంగల్ కో, హైదరాబాద్ కో తరలిస్తే శాంతి భద్రత సమస్య తలెత్తవచ్చునని ఆయన తెలిపారు.

తెలంగాణపై కాంగ్రెసు నాయకులు మాట్లాడకపోవడమే మంచిదని మంత్రులు అభిప్రాయపడ్డారు. తెలంగాణ అంశం సోనియా వద్ద ఉన్నందున తాము చేసేదేమీ లేదని మంత్రివర్గం అభిప్రాయపడినట్లు సమాచారం. కాగా, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు వంటి మంత్రులు తప్పు పట్టారు. పోలీసుల అత్యుత్సాహం వల్ల సమస్య ఉత్పన్నమైందని వారన్నారు. పోలీసు అత్యుత్సాహానికి తాము సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారన్నారు. ఉస్మానియా వంటి సున్నితమైన ప్రదేశాల్లో సంయమనం పాటించే పోలీసు అధికారులను నియమించాలని వారు కోరారు.

కాగా, ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని పరిస్థితులపై మానవ హక్కుల కమిషన్ విద్యార్థులకు సమన్లు జారీ చేసింది. శాంతియుతంగా ఆందోళన సాగించాలని మానవ హక్కుల కమిషన్ విద్యార్థులను ఆదేశించింది. పోలీసులే అత్యుత్సాహం ప్రదర్శించిందని విద్యార్థులు మానవ హక్కుల కమిషన్ కు వివరించారు. తమపై దాడి చేసిన పోలీసులను గుర్తించి వారిపై కేసులు పెట్టాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. డిసిపి స్టీఫెన్ రవీంద్రను సస్పెండ్ చేయాలని వారు కోరారు. పోలీసు దాడిలో గాయపడిన విద్యార్థులు తమ వాదనను మానవ హక్కుల కమిషన్ ముందు తమ వాదనను వినిపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+