మేం తెలంగాణకు వ్యతిరేకం కాదు: సిఎం

ప్రత్యేక తెలంగాణకు కాంగ్రెసు వ్యతిరేకం కాదనే విషయాన్ని ప్రజలకు చేరవేయాలని ఆయన మంత్రులకు సూచించారు. అయితే తెలంగాణ అంశంపై తాము ఎలా మాట్లాడుకుండా ఉండగలమని మంత్రి బొత్సా సత్యనారాయణ అనుమానం వ్యక్తం చేశారు. రెండో ఎస్సార్సీకి కట్టుబడి ఉన్నామని చెబుతామని ఆయన అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని రోశయ్య స్పష్టం చేశారు. ప్రభుత్వపరంగా అన్ని చర్యలూ తీసుకుంటామని ఆయన చెప్పారు. కాగా, కెసిఆర్ ఆమరణ దీక్ష నేపథ్యంలో ఎఐసిసి ప్రధాన కార్యదర్శి అనిల్ శాస్త్రి రోశయ్యతో చర్చలు జరిపినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications