పులివెందులలో పోటీకి టిడిపి దూరం

Chandrababu Naidu
హైదరాబాద్: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి సతీమణి వైయస్ విజయలక్ష్మి పోటీ చేస్తున్న కడప జిల్లా పులివెందుల శాసనసభా స్థానానికి పోటీ చేయకూడదని తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది. పులివెందులలో పోటీ విషయమై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సోమవారం కడప జిల్లా నాయకులతోనూ, పులివెందుల నియోజక వర్గం నేతలతోనూ చర్చించారు. వైయస్ సతీమణి పోటీ చేస్తున్నందున తమ పార్టీ అభ్యర్థిని పోటీకి దింపకూడదని సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. వైయస్ సతీమణిని కాకుండా మరొకరిని కాంగ్రెసు పార్టీ పోటీకి దింపితే తమ పార్టీ కూడా పోటీ చేసి ఉండేవారని తెలుగుదేశం నాయకులు అంటున్నారు.

పులివెందులలో వైయస్ రాజశేఖర రెడ్డి సతీమణి విజయలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు సహకరించాలని ముఖ్యమంత్రి కె. రోశయ్య ప్రతిపక్షాల నాయకులను కోరారు. ఆయన ఆదివారం సాయంత్రం ప్రతిపక్షాల నాయకులకు ఫోన్ చేసి ఆ విజ్ఞప్తి చేశారు. చంద్రబాబుతోనే కాకుండా ఆయన ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి, లోకసత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణతో మాట్లాడారు. మిగతా ప్రతిపక్షాల నాయకులతో కూడా ఆయన మాట్లాడారు. ఈ స్థితిలో పులివెందులలో ఇతర పార్టీలు పోటీ చేసే అవకాశాలు లేవనే చెప్పవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+