పొన్నాల ఇంటిపై మహిళల దాడి యత్నం

నల్లగొండ జిల్లా తిప్పర్తి వద్ద ఆగంతకులు రైల్వే ట్రాక్ ఫిష్ ప్లేట్లను తొలగించారు. సకాలం సిబ్బంది గమనించి వాటిని సరిచేశారు. దీంతో ప్రమాదం తప్పింది. అయితే ఈ సంఘనటతో తమకు సంబంధం లేదని తెరాస నాయకులంటున్నారు. నల్లగొండ జిల్లా నార్కెట్ పల్లి వద్ద ఆగంతకులు కొంత మంది ఒక ప్రైవేట్ బస్సును ధ్వంసం చేశారు. దూర ప్రాంతాల రైళ్లకు ఇబ్బంది లేదని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెప్పారు. తెలంగాణ ప్రభావం తక్కువగా ఉందని చెప్పే ఖమ్మం జిల్లాలోనూ హైదరాబాదులోనూ బంద్ కొనసాగుతోంది. ఆర్టీసి దూర ప్రాంతాలకు వెళ్లే 424 బస్సులను నిలిపేసింది.












Click it and Unblock the Notifications