కఠోర దీక్షలో కెసిఆర్: జయశంకర్

K Chandrasekhar Rao-Jayashankar
ఖమ్మం: తెలంగాణ రాష్ట్రసమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు దీక్ష కొనసాగుతోందని, ఆయన కఠోర దీక్షలో ఉన్నారని తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలిపారు. కేసీఆర్‌ దీక్ష విరమణ జరగదని, ఆయనను జైల్‌నుంచి బయటకు రప్పించడానికి బెయిల్‌ కోసం ప్రయత్నించబోమని తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

దీక్ష విషయంలో ప్రభుత్వమే గందరగోళం సృష్టిస్తోందని ఆరోపించారు. తెలంగాణ అంశం కీలకదశకు చేరుకుందని, ఇలాంటి సమయంలో విమర్శలు మానుకోవాలని తెలంగాణ వాదుల ఉద్దేశించి అన్నారు. ఖమ్మం నుంచి కేసీఆర్‌ను తరలించాలని ఆయన డిమాండ్‌చేశారు. బెయిల్‌ తీసుకోబోమని, దీక్ష కొనసాగుతుందని, అనుమానాలు అనవసరమని, ప్రాణత్యాగానికైనా కేసీఆర్‌ సిద్ధమేనని జయశంకర్‌ చెప్పారు.

ఖమ్మంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై ఉన్నతాధికారులతో మాట్లాడామని ఆయన చెప్పారు. ఖమ్మంలో తెలంగాణ వ్యతిరేక శక్తుల ప్రాబల్యం ఉన్నందునే కేసీఆర్‌ స్థలమార్పిడి కోరుతున్నారని జయశంకర్‌ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+