నా మనసు తిరుపతిలోనే ఉంది: చిరంజీవి

తాను సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పని చేస్తానని ఆయన చెప్పారు. తిరుపతి ప్రజల సమస్యలను ముఖ్యమంత్రి రోశయ్య, అధికారుల దృష్టికి తీసుకుని వెళ్తామని ఆయన చెప్పారు. తిరుపతి నుంచి ఆయన ఫోన్ చేసి కెసిఆర్ తో మాట్లాడారు. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. తిరుపతి నుంచి రాగానే ఆయన కెసిఆర్ ను చూడడానికి నిమ్స్ వెళ్తారు. ఇదిలా ఉంటే, ప్రజారాజ్యం నాయకులు నిమ్స్ కు వెళ్లి కెసిఆర్ ను పరామర్శించారు. తాము సామాజిక తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నామని ప్రజారాజ్యం పార్టీ నాయకుడు నారగోని చెప్పారు. ఆంధ్రావాలో బాగో అనే నినాదంతో మాత్రమే తాము విభేదించామని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు.