వరంగల్: నిన్నటి వరకు ఉద్యోగ, విద్యార్థి, తెరాస వరకే పరిమితమైన ఉద్యమానికి ఇతర వర్గాల నుంచి కూడా మద్దతి లభిస్తోంది. వైద్యులు తొలిసారి ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. పెయింటింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ కళాకారులు, ఆటో కార్మిక సంఘాలతోపాటు పలు సంఘాలు ఉద్యమానికి మద్దతుగా ప్రత్యక్షంగా నిరసన ప్రదర్శన చేశాయి. ఆటో యూనియన్లు జిల్లావాప్తంగా గురువారం ఆటోల బంద్ తలపెట్టాయి. జిల్లాలో తెరాస కాగడాల ప్రదర్శన నిర్వహించింది.
కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థులు మాజీ మంత్రి కొండా సురేఖపై విమర్శలు గుప్పించారు. జగన్‌ను సీఎం చేయటానికి మంత్రి పదవి త్యాగం చేసిన ఆమె.. తెలంగాణాకు జరుగుతున్న అన్యాయం గురించి ఎందుకు మాట్లాడటం లేదని విద్యార్థులు ప్రశ్నించారు. ఆమె దిష్టిబొమ్మను దహనం చేశారు. ఉద్యోగ సంఘాలు ఐక్య కార్యాచరణ సమితిగా ఏర్పడి హైదరాబాద్ ఫ్రీజోన్ అంశానికి వ్యతిరేకంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టాయి.