హైదరాబాద్ లో జయసుధ శారీ ఎగ్జిబిషన్

ఇంతవరకూ సుమారు 150 చీరలకు తాను డిజైన్ చేశాననీ, వాటిని ఎగ్జిబిషన్ కమ్ సేల్ లో ఉంచుతున్నామనీ జయసుధ తెలిపారు. ఈసారి తాను డిజైన్ చేసిన చీరలతో పాటు ఇతర డిజైనర్ల చీరలు కూడా ఇందులో ప్రదర్శిస్తున్నామనీ, గతంలో తాను హైద్రాబాద్, విజయవాడల్లో నిర్వహించిన ఎగ్జిబిషన్లకు చాలా మంచి స్పందన వచ్చిందనీ చెప్పారు. వ్యక్తిగతంగా తనకు చీరలంటే చాలా ఇష్టమనీ, చాలా సినిమాల్లో చీరలతోనే కనిపించాననీ నవ్వుతూ చెప్పారు. సహజంగా శారీ ఎక్స్ పోను ఏటా అక్టోబర్ లో నిర్వహించే తాను ఈసారి మాత్రం తమ ప్రియతమ నాయకుడు వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఆకస్మిక మృతితో వాయిదా వేసి ఇప్పుడు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.