వైయస్సార్ మృతికి అసెంబ్లీ సంతాపం

వైయస్ రాజశేఖర రెడ్డికి నివాళి అర్పిస్తూ ప్రతిపాదించిన ముఖ్యమంత్రి కె. రోశయ్య వైయస్ రాజశేఖర రెడ్డి నాయకత్వ ప్రతిభను ప్రశంసించారు. విధి బలీయమైందని, దాంతో తాము గొప్ప నాయకుడిని కోల్పోయామని ఆయన అన్నారు. తనకు, వైయస్ రాజశేఖర రెడ్డికి మధ్య వ్యక్తిగత విభేదాలు లేవని ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పార్టీ విధానాల పరంగా వ్యతిరేకించుకున్నామని ఆయన చెప్పారు. వైయస్ మరణం రాజకీయాలకు, ముఖ్యంగా కాంగ్రెసు పార్టీ తీరని నష్టమని ఆయన అన్నారు.
చిరునవ్వుతో వైయస్ రాజశేఖర రెడ్డి ప్రయత్నించేవారని ప్రజారాజ్యం పార్టీ నేత చిరంజీవి చెప్పారు. తాను వైయస్ చూసి నేర్చుకునే అవకాశం ఏర్పడిందని ఆయన చెప్పారు. వైయస్ లేరంటే నమ్మడానికి వీలు లేకుండా ఉందని ఆయన అన్నారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినవారికి వైయస్ వ్యక్తిత్వం, మనస్తత్వం నేర్చుకోవడానికి అవకాశం కలిగించేదని ఆయన అన్నారు. వ్యక్తిత్వం స్ఫూర్తినిచ్చేదని ఆయన అన్నారు. అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ జె. గీతారెడ్డి తదితరులు మాట్లాడారు.












Click it and Unblock the Notifications