హై కమాండ్ దూత కెసిఆర్ తో మాట్లాడ్తారు

ఇదిలా వుంటే, మాజీ మంత్రి ఆర్ దామోదర్ రెడ్డి నివాసంలో కాంగ్రెసు తెలంగాణ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు. తెలంగాణపై పార్టీపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి కె. జానారెడ్డి చొరవ ప్రదర్శించారు. అంతా కలిసి సోనియాను కలిసే ఉద్దేశంతో వారున్నారు. అయితే శాసనసభ్యుడు విష్ణువర్ధన్ రెడ్డి సమావేశాన్ని బహిష్కరించారు. తన తండ్రి పి. జనార్దన్ రెడ్డి పోతిరెడ్డిపాడుపై, 610 జీవోపై ఎందుకు మాట్లాడలేదని, ఇప్పుడు మాట్లాడడంలో అర్థమేమిటని ఆయన ప్రశ్నించారు. అప్పుడే మాట్లాడి ఉంటే తన తండ్రి మరణించి ఉండేవారు కారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications