జర్నలిస్టులపై దాడి: అసెంబ్లీలో ధర్నా

జర్నలిస్టులు ఓయు నుంచి ర్యాలీగా వచ్చి శాసనసభ మెయిన్ గేట్ వద్ద ధర్నాకు దిగారు. తమపై దాడికి నిరసనగా జర్నలిస్టులు శాసన మండలి వార్తల సేకరణను బహిష్కరించారు. ఆ తర్వాత జర్నలిస్టులు ముఖ్యమంత్రి కె. రోశయ్య ఛేంబర్ వద్ద ధర్నాకు దిగారు. జర్నిలిస్టులకు హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. సంఘటనపై విచారణ జరిపిస్తామని ఆమె హామీ ఇచ్చారు. దానికి జర్నలిస్టులు అంగీకరించలేదు. సంఘటనపై మరో వైపు డిజిపి గిరీష్ కుమార్ విచారణకు ఆదేశించారు. జర్నలిస్టుల ధర్నాతో శాసనసభ ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులపై పోలీసుల దాడుల గురించి తెలియడంతో హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలకు చెందిన న్యాయవాదులు ఓయుకు చేరుకున్నారు. వారు ర్యాలీ నిర్వహించారు.












Click it and Unblock the Notifications