ఓయుకు నేనే వచ్చి చూస్తా: సుభాషణ్ రెడ్డి

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. శాంతియుతంగా కూర్చున్నవారిని పోలీసులు చెదరగొట్టారని విద్యార్థినులు కూడా ఆరోపిస్తున్నారు. విద్యార్థులు ఉస్మానియా విశ్వవిద్యాలయం పక్కనే ఉన్న మాణిక్వేశ్వర నగర్ గోడను ధ్వంసం చేశారు. మహిళా హాస్టళ్ల విద్యార్థినులు పోలీసుల చర్యతో చెట్టుకొకరు పుట్టకొకరు పరుగులు తీశారు. విద్యార్థినులను బిజెపి శాసనసభ్యుడు కిషన్ రెడ్డి పరామర్శించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పరిస్థితిపై తెలంగాణ కాంగ్రెసు శాసనసభ్యులు ముఖ్యమంత్రి కె. రోశయ్యను కలిసి వివరించారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యులు నిరసన తెలిపారు.












Click it and Unblock the Notifications