కెసిఆర్ ఆరోగ్యంపై అట్టుడికిన పార్లమెంటు

కెసిఆర్ దీక్ష విరమించేలా చూడాలని, తగిన నిర్ణయం తీసుకోవాలని సమాజ్ వాదీ పార్టీ సభ్యుడు ములాయం సింగ్ యాదవ్ కోరారు. తమకు కెసిఆర్ ఆరోగ్యం ముఖ్యమని డిఎంకె అన్నది. రాజ్యసభలో బిజెపి సభ్యుడు వెంకయ్యనాయుడు తెలంగాణ అంశాన్ని ప్రస్తావించారు. తెలంగాణ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కెసిఆర్ ఆరోగ్యం క్షీణిస్తోందని, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే ప్రమాదం సంభవిస్తుందని బిజెపి సభ్యులు అన్నారు. ప్రభుత్వ చర్యకు నిరసనగా బిజెపి సభ్యులు ఆందోళనకు దిగారు. జీరో అవర్ లో ప్రస్తావించినందున దీనికి మంత్రి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని సభాపతి ఎంతగా చెప్పినా బిజెపి సభ్యులు వినిపించుకోలేదు. సద్దుమణగపోవడంతో రాజ్యసభను సభాపతి 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications