తెలంగాణపై అంత తేలిక కాదు: రోశయ్య

తెలంగాణపై తీర్మానం చేయడం అంత తేలిక కాదని ఆయన చెప్పారు. ఈ సమయంలో హరీష్ రావు లేచి మాట్లాడారు. దానికి రోశయ్య ప్రతిస్పందిస్తూ బాధను వ్యక్తం చేయడానికి కూడా ఒక పద్ధతి ఉంటుందని, తెలంగాణ సున్నితమైన అంశమని, ఏ ప్రాంతానికి చెందిన వారు కూడా ఉద్రేకాలకు లోను కావద్దని ఆయన అన్నారు. తెలంగాణ అనేది తనంత తాను లేచి తీర్మానం చేసేది కాదని ఆయన స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణలాగానో, ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడం లాగానో తెలంగాణపై తీర్మానం చేయాలంటే అంత తేలిక కాదని ముఖ్యమంత్రి అన్నారు. తెలంగాణపై ప్రభుత్వం బాధ్యత తీసుకుని వ్యవహరిస్తుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications