ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోసం ర్యాలీ

తెలంగాణ ఉద్యమం, కేసీఆర్ ఆమరణ దీక్షలకు ప్రభుత్వం తలొగ్గి రాష్ట్రాన్ని ముక్కలు చేయకూడదని, రాష్ట్రం సమైక్యాంధ్రగా ఉండాలని కడప జిల్లాలో ఉద్యమ శంఖం మొద లైంది. రాష్ట్రాన్ని సమైక్యాంధ్రగా ఉంచాలన్న నినాదమే ఎక్కువగా విని పిస్తుండగా, ఒకవేళ అలా చేయకపోతే లక్ష కోట్ల బడ్జెట్ కేటాయించి గ్రేటర్ రాయలసీమను ఏర్పాటు చేయాలని మరికొందరు పేర్కొన్నారు. ఏది ఏమైనా తెలంగాణ ఉద్యమం తీవ్ర రూపం దాల్చిన నేపధ్యంలో సీమ గళం వినిపిస్తోంది. ఒకరొకరుగా నేతలు, ఉద్యోగులు, విద్యార్ధి సంఘా లు, పారిశ్రామికవేత్తలు సమైక్యాంధ్ర నినాదాన్ని లేవనెత్తారు. కడపలో ఏబీవీపీ విద్యార్ధి సంఘం ఆధ్వర్యంలో మంగళవారం విద్యా ర్థులు ఆందోళన పథంలో సాగారు.
రోశయ్య, చంద్రబాబు, చిరంజీవిలు కేసీఆర్‌కు భయపడి తెలంగాణకు అనుకూలంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారి దిష్టిబొ మ్మలను ఏడురోడ్ల కూడలిలో దహనం చేశారు. తెలంగాణ గురించి మాట్లాడుతున్న వీరు రాయలసీమకు చేసిందేమిటని ప్రశ్నించారు. అంతకు ముందు కడప నగరంలో ర్యాలీ నిర్వహించారు. బద్వేలులో ఐక్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర నినాదంతో భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశా రు. రాయలసీమ, కోస్తా, తెలంగా ణలు కలిసి విశాలాంధ్రగానే ఉండ డం శ్రేయస్కరమని వారు పేర్కొ న్నారు. ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మె ల్యే వరదరాజులరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి తలొగ్గి రాష్ట్రాన్ని ముక్కలు చేయకూడదని అన్నారు. అలాంటి ఆలోచనలుంటే విరమించుకోవాలని ఆయన పేర్కొ న్నారు.