ఆంధ్రుల ఆత్మ గౌరవం కోసమే ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం

ఈ సందర్భంగా వసంత మాట్లాడుతూ, 1972లో ఇదే ప్రదేశం నుంచి జై ఆంధ్ర ఉద్యమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. ప్రస్తుతం ప్రత్యేకాంధ్ర ఉద్యమాన్ని కూడా ఇక్కడ నుంచే ప్రారంభిస్తున్నామన్నారు. తెలంగాణ ఇస్తే ఆంధ్ర రాష్ట్రం సహజంగానే వస్తుందని కొందరు పేర్కొంటున్నారని, ఆంధ్రుల హక్కులను సాధించడం కోసమే ఈ ఉద్యమం లేవనెత్తామన్నారు. 1956లో ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగిన నాటి నుంచి తెలంగాణ వాదులు ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తూనే ఉన్నారన్నారు.
బ్యానర్ విడుదల...
ప్రత్యేకాంధ్ర ఉద్యమం ప్రారంభించిన సందర్భంగా 'ఆంధ్రుల ఆత్మ గౌరవం కోసం ప్రత్యేకాంధ్ర కావాలి' అనే నినాదంతో బ్యానర్‌ను వసంత విడుదల చేశారు. ఇదే నినాదంతో ఆంధ్రుల ప్రత్యేక ప్రతిపత్తికి తాను పోరాటం జరపనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
బహిరంగ చర్చకు రెడీ
నందిగామ టౌన్: స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధిపై ఎప్పుడైనా, ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమని ఆప్కాబ్ చైర్మన్ వసంత నాగేశ్వరరావు సవాల్ విసిరారు. స్థానిక పాత బస్టాండు సమీపాన కాంగ్రెస్ నాయకుడు తునికిపాటి సాయి స్వగృహంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వసంత మాట్లాడుతూ ఎప్పుడో బ్రిటిష్ పాలకుల కాలంలో జరిగిన ప్రాజెక్టుల కారణంగానే ఆంధ్ర అభివృద్ధి చెందిం దని, స్వాతంత్య్రానంతరం ఇక్కడ వారికి ప్రత్యేకంగా ఒరిగిందేమీ లేదని వివరించారు. జలయజ్ఞంలో సైతం తెలంగాణకే దివంగత సీఎం వైఎస్ పెద్దపీట వేశారన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు తెలంగాణలోనే ఉన్నాయని, ఆ ప్రాంత అభివృద్ధి కోసం ప్రభుత్వాలు ప్రత్యేక ప్యాకేజీలు కూడా అమలు చేశాయని వివరించారు. ఆంధ్రుల ఆత్మాభిమానం దెబ్బ తినక ముందే అన్నదమ్ముల్లా విడిపోవటం మంచిదని ఆప్కాబ్ చైర్మన్ వసంత నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు.
దేశంలోని అన్ని రాష్ట్రాల్లో తెలుగువారి పట్ల ప్రత్యేక గౌరవభావం ఉందని, రాష్ట్ర విభజనకు కొట్టుకోవటం వల్ల అది తగ్గిపోతోందన్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారు రాజధానిలో ఉన్నతంగా బతుకుంటే, సొంత రాష్ట్రంలోనే ఆంధ్ర ప్రాంతం వారు అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 1972లోనే తాను జై ఆంధ్ర ఉద్యమంలో పాల్గొని రెండు నెలలపాటు జైలుశిక్ష కూడా అనుభవించానని, ఆంధ్రుల ఆత్మాభిమానం దెబ్బతింటే తాను సహించేది లేదని, వారికి అవమానం జరిగితే తన వాణి విన్పిస్తూనే ఉంటానని పేర్కొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితంగా తెలుగు మాట్లాడే వారితో రాష్ట్రం ఏర్పడిందని, తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని తెలంగాణ ప్రాంతం వారు కోరడం సబబు కాదన్నారు. ఈ సమావేశంలో పీసీసీ సభ్యుడు రేపాల మోహన్‌రావు, వేదాద్రి ఎత్తిపోతల అధ్యక్షుడు ముక్కపాటి నరసింహారావు పాల్గొన్నారు
-
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
హైదరాబాద్‌లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications