కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆంధ్ర రాజధానిగా విశాఖను ప్రకటించాలని డిమాండ్

By Santaram
|
Google Oneindia TeluguNews

Vishakapatnam
విశాఖపట్నం: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి, ఆంధ్ర రాష్ట్రం విడిపోతే ఉత్తరాంధ్ర కేంద్రంగా విశాఖను ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా ప్రకటించాలని ఆంధ్ర రాష్ట్ర సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జెటి రామారావు డిమాండ్‌ చేశారు. ఒక రాష్ట్ర రాజధానికి ఉండవలసిన లక్షణాలు విజయవాడ, గుంటూరు, కర్నూలు కంటే విశాఖపట్నానికే ఎక్కువగా ఉన్నాయన్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌ గురజాడ అప్పారావు విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ఉత్తరాధ్ర జిల్లాలకు చెందిన జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ప్రతినిధుల సమావేశం జరిగింది. వీరికి ప్రజా సంఘాలు, జర్నలిస్టుల సంఘాలు మద్దతు నిచ్చాయి. ఈ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

తెలంగాణ ఉధ్యమం బలపడిన నేపధ్యంలో ఒక వేళ ప్రత్యేక తెలంగాణ ర్రాష్టాన్ని ప్రకటిస్తే ఉత్తరాంధ్ర కేంధ్రంగా విశాఖను రాష్ట్ర రాజధానిగా ప్రకటించాలని రామారావు డిమాండ్‌ చేసారు. హైదరాబాద్‌ ప్రీజోన్‌ కోసం మంగళవారం శాసన సభలో తీర్మానం చేయబోతున్నారని ప్రీజోన్‌ కాదని చెప్పడం సరికాదన్నారు. ఆంధ్ర ప్రాంత ప్రజల ఓట్లతో అధికారం పొందిన నేతలు జోన్‌ కాదని చెప్పడం సమంజసం కాదన్నారు. పోలవరం ప్రాజెక్టులను వెంటనే ప్రారంభించాలని రామారావు డిమాండ్‌ చేసారు. సమైకాంధ్ర నినాదంతో ఏయూ విద్యార్దులు ర్యాలీలు, ధర్నాలు చేస్తున్నారని దీనిని తాము వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. సమైకాంధ్ర అవసరం లేదని రాష్ట్ర విభజన జరిపి ఉత్తరాంధ్రను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించి విశాఖను రాజధాని చేయాలని రామారావు డిమాండ్‌ చేసారు.

రాయలసీమ, ఆంధ్రాను కలపి ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించినా విశాఖను మాత్రం రాష్ట్ర రాజధానిగా చేయాలని ఆయన డిమాండ్‌ చేసారు. చిచిన్న ర్రాష్టాలతోనే ప్రాంతాలు అభివృద్ది చెందుతాయన్నారు. కావున రాష్ట్ర విభజన అవసరమన్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న రైల్యే డివిజన్‌ వెనుకబాటు తనానికి గురవుతోందని రామారావు ఆవేదన వ్యక్తం చేసారు. ఉత్తరాంధ్ర ప్రాంత నిధులను ఇతర ప్రాంతాల అభివృద్దికి వెచ్చిస్తున్నారని దీని వలనే ఈప్రాంతం వెనుకబాబు తనానికి గురవుతోందన్నారు. ఆంధ్ర రాష్ట్ర సమితి ప్రతినిధులు సన్‌మూర్తి, నరవ ప్రకాశరావు, జీవి రమణమ్మ, బివి అప్పారావు, జర్నలిస్టుల సంఘాల ప్రతినిధులు పి.నారాయణ, చింతా ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X