' హైదరాబాద్ కు దండం, ప్రత్యేక రాజధాని కావాలి'

సమైక్యాంధ్ర భావాన్ని తాము గౌరవిస్తామని, అయితే కలిసి ఉండాలని కోరుకోవడానికి సరైన కారణాలు వెల్లడించాలని విజ్ఞప్తి చేశారు. రెండు లక్షల కోట్ల రూపాయల జలయజ్ఞంలో తెలంగాణాకు 1.30 లక్షల కోట్లు వరకు కేటాయించి, ఆంధ్రాకు 20వేల కోట్లు విదిల్చారన్నారు.
350 మంది బలిదా నం చేసి మనం సాధించుకున్న ఆరు సూత్రాల ఒప్పందంలో భాగమైన హైదరాబాద్ పోలీస్ నియామకం రక్షణ ఒప్పందాన్ని తిరగదోడి ఆంధ్రాప్రాంత వాసుల పొట్టగొడుతున్నారని విమర్శించారు. ఢిల్లీలో పోలీస్ ఉద్యోగాలకు ఎంపికయ్యే హక్కు ఉంది గాని, సొంత రాష్ట్రంలో వివక్షతకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ పోలీసుల్లో 70శాతం తెలంగాణా వాళ్లు ఉండడంతో, ఆంధ్రా ప్రాంత ప్రజలపై అక్కడ దాడులు చేస్తుంటే జేబుల్లో చేతులు పెట్టుకుని చూస్తుండిపోయారని విమర్శించారు.
వందశాతం పోలీసులు తెలంగాణ వాళ్ళే అయితే మేం బతుకుతామా అని ప్రశ్నించారు. మా ప్రాంతం నుంచి తరలించిన డబ్బుతో హైదరాబాద్‌ను అభివృద్ధి చేశారని, దానిపై మాకు హక్కు ఉందని స్పష్టంచేశారు. శుక్రవారాలలో మేధావులతో ఏలూరులో సమావేశం నిర్వహించి భవిష్యత్తు ఉద్యమం కార్యాచరణ ప్రణాళికను నిర్ణయిస్తామన్నారు.