నేను రాజీనామా చేయలేదు: స్పీకర్

మొత్తం 93 మంది శాసనసభ్యులు రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. వీరిలో 53 మంది కాంగ్రెసు, 29 మంది కాంగ్రెసు, 11 మంది ప్రజారాజ్యం పార్టీ సభ్యులున్నట్లు ఆయన తెలిపారు. తన కన్నా ముందే మీడియా వారి పేర్లను తెలియజేస్తోందని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఏ ప్రాంతానికి చెందినవారు ఎంత మంది అనేది తాను చూడలేదని, కొందరు స్వయంగా రాజీనామా లేఖలు ఇచ్చారని, మరికొందరు ఫ్యాక్శ్ ద్వారా పంపారని, తాను వివరాల్లోకి వెళ్లలేదని ఆయన చెప్పారు.
రాజీనామా చేసినవారిని పిలిపించి మాట్లాడిన తర్వాతనే వాటి ఆమోదంపై నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు. నిబంధనలు, సంప్రదాయాల ప్రకారం వ్యవహరిస్తానని ఆయన చెప్పారు. రాజీనామాల విషయంలో తాను నడుచుకోవాల్సిన విషయంపై ఎవరో తనకు చెప్పాల్సిన అవసరం లేదని, నిబంధనల ప్రకారం నడుచుకుంటానని ఆయన చెప్పారు. తాను రాజీనామాలను ఆమోదించలేదు కాబట్టి సభ యధావిధిగా రేపు సమావేశమవుతుందని ఆయన చెప్పారు.