వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లగడపాటి విడుదల: దీక్ష యోచన విరమణ

By Pratap
|
Google Oneindia TeluguNews

Lagadapati Rajagopal
హైదరాబాద్: కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ను పోలీసులు అరెస్టు చేసి విడుదల చేశారు. సమైక్యాంధ్ర నినాదంతో తలపెట్టిన దీక్ష యోచనను ఆయన సోమవారం విరమించుకున్నారు. అనంతరం ఆయన ముఖ్యమంత్రి కె. రోశయ్యను కలిశారు. రోశయ్యతో భేటీ తర్వాత ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన జరగదని, రాష్ట్రాన్ని ఎవరూ విభజించలేరని ఆయన అన్నారు. శాసనసభ నిరవధికంగా వాయిదా పడినందున తెలంగాణపై శాసనసభలో తీర్మానం ప్రతిపాదించలేకపోయినట్లు రోశయ్య తనకు చెప్పారని ఆయన తెలిపారు. తన ఉద్యమం ఆదగని ఆయన చెప్పారు. రాజీనామా చేసిన కోస్తాంధ్ర కాంగ్రెసు శాసనసభ్యులతో చర్చించిన తర్వాత తన భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్ణయించుకుంటానని ఆయన చెప్పారు.

తెలుగుజాతి ఐక్యతకు ఎవరూ భంగం కలిగించలేరని ఆయన అన్నారు. తెలంగాణపై తీర్మానం పెడితే 225 మంది శాసనసభ్యులు వ్యతిరేకంగా ఓటేసి తెలుగుజాతి ఐక్యతను చాటి ఉండేవారని, తెలుగుజాతి ఐక్యతను చాటడానికి శానససభ సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. దీక్ష కోసం హైదరాబాదు వచ్చిన తనను పోలీసు అరెస్టు చేశారని ఆయన చెప్పారు. ఇంతకాలం ఒకే వాదన ఉందని, ఇప్పుడు విభజన వాదం ముందుకు వచ్చిందని, రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసి బలహీనపరచాలని చూస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసి రాజకీయ నేతలు లాభం పొందడానికి చూస్తున్నారని, తాను ప్రజల మేలు కోసం రాజకీయాల్లోకి వచ్చానని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X