హైదరాబాద్: తెలంగాణ అనుకూల, వ్యతిరేక నినాదాలతో రాష్ట్ర శాసనసభ సోమవారం కూడా దద్ధరిల్లింది. సభా కార్యక్రమాలు స్తంభించాయి. దీంతో సభను స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి అర గంటపాటు వాయిదా వేశారు. తెలంగాణ అనుకూల, సమైక్యాంధ్ర అనుకూల వర్గాలు తమ మెట్టు దిగకపోవడంతో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ముదిరింది. సభ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క రోజు కూడా సజావుగా సాగలేదు.
కాగా, సభా కార్యక్రమాల స్తంభనపై, శాసనసభ్యుల రాజీనామాలపై స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కె. రోశయ్యతో, శాసనసభ ఫ్లోర్ లీడర్ జె. గీతారెడ్డితో సమావేశమయ్యారు. దాదాపు 159 మంది కోస్తా, రాయలసీమ శాసనసభ్యులు సమైక్యాంధ్రను కోరుతూ రాజీనామాలు సమర్పించారు. వాటిని ఆమోదించాలా, వద్దా అనే విషయంపై స్పీకర్ ఇప్పటి వరకు ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి