హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ఏర్పాటు ప్రకటనకు వ్యతిరేకంగా తాము చేసిన రాజీనామాలను ఉపసంహరించుకోబోమని కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి చెప్పారు. తమ సమస్యకు పరిష్కారం లభించే వరకు రాజీనామాలను ఉపసంహరించుకునే ప్రసక్తి లేదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తమ రాజీనామాలను స్పీకర్ ఇంకా ఆమోదించ లేదని ఆయన చెప్పారు. తమ రాజీనామాలపై తుది నిర్ణయం స్సీకర్ కిరణ్ కుమార్ రెడ్డిదేనని ఆయన అన్నారు. తమ సమస్య పరిష్కారానికి దూత వస్తారని ఆశిస్తున్నామని ఆయన చెప్పారు.
సీమాంధ్ర మంత్రులం తదుపరి సమావేశమైన ఏం చేయాలనే విషయంపై నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి గాదె వెంకట రెడ్డి చెప్పారు. తాము రాజీనామా చేస్తామంటే ముఖ్యమంత్రి కె.రోశయ్య వద్దన్నారని, కలసి వెళ్లాలని ముఖ్యమంత్రి అన్నారని ఆయన చెప్పారు. సమైక్యాంధ్ర ఉద్యమం నడుస్తోందని ఆయన విడిగా మీడియా ప్రతినిధులతో అన్నారు. ఆస్తులకు, ప్రజాజీవనానికి ఇబ్బంది కలగకుండా ఉద్యమం చేయాలని కోరుతున్నామని ఆయన చెప్పారు. విధ్వంసానికి పాల్పడితే తీవ్ర చర్యలుంటాయని ఆయన చెప్పారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి