హైదరాబాద్: సమైక్యాంధ్ర నినాదంతో ఆందోళన చేస్తున్న శ్రీకృష్ణదేవరాయాంధ్ర విశ్వవిద్యాలయం (ఎస్కెయూ) విద్యార్థులపై దాడిని సీమాంధ్ర రాజకీయ నాయకులు ఖండించారు. విద్యార్థులపై లాఠీచార్జీని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఖండించారు. విద్యార్థులకు ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలుగుదేశం శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ అన్నారు.
విద్యార్థులపై లాఠీచార్జీని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఖండించారు. సమైక్యాంధ్ర నినాదంతో ఆయన విజయవాడలో నిరాహార దీక్ష ప్రారంభించారు.విద్యార్థులపై లాఠీచార్జీని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరా రెడ్డి కూడా ఖండించారు. విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జీ చేసిన విషయంపై ఆయన ముఖ్యమంత్రి కె. రోశయ్యకు, హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఫిర్యాదు చేశారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి