హైదరాబాద్: సమైక్యాంధ్రపై స్పష్టమైన హామీని పొందేందుకు రాష్ట్రానికి చెందిన కాంగ్రెసు శానససభ్యులు, ఎమ్మెల్సీలు రేపు బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రభుత్వ విఫ్ శైలజానాథ్ ను సమైక్యాంధ్ర ఉద్యమం కోసం తమ జెఎసి కన్వీనర్ గా ఎన్నుకున్నారు. సమైక్యాధ్ర కోసం కాంగ్రెసు అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు వారు శైలజానాథ్ నాయకత్వంలో ఢిల్లీకి వెళ్లనున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను నిలిపేయాలని, సమైక్యాంధ్రకే కట్టుబడి ఉంటామని తమ కాంగ్రెసు పార్టీ నాయకత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మంగళవారం పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. శాసనసభకు ఊరేగింపుగా సాగారు. వారు రాష్ట్ర గవర్నర్ ఎన్డీ తివారిని కూడా కలిసేందుకు సిద్ధపడుతున్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి