విజయవాడ: శాసనసభలో తెలంగాణ తీర్మానం ప్రతిపాదించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ విజయవాడలో తన ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. తన దీక్ష సోమవారం హైదరాబాదులోని ఫలక్ నుమా పోలీసు స్టేషనులో ప్రారంభమైంది. హైదరాబాదులో తన దీక్షను భగ్నం చేస్తూ వచ్చారని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ఆగిపోయిందని స్పష్టమైన ప్రకటన రావాలని, అంతవరకు తన దీక్ష కొనసాగుతుందని ఆయన చెప్పారు. తెలుగుగడ్డ సమైక్యాంధ్రకు మద్దతు తెలుపుతుందని ఆయన చెప్పారు.
తనను బలవంతంగా విజయవాడకు తరలించారని, దీంతో తన దీక్షను విజయవాడలో కొనసాగిస్తున్నానని ఆయన చెప్పారు. తనకు పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా తనకు మద్దతు లభిస్తుందని ఆయన చెప్పారు. తాను మొదటి నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్నట్లు ఆయన తెలిపారు. తాను తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ను ఎదుర్కున్నానని ఆయన చెప్పారు. ఉద్యమం నుంచి తాను వెనక్కి పోయేది లేదని ఆయన చెప్పారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి సమైక్యాంధ్ర కోసం నిలబడ్డారని ఆయన అంతకు ముందు ప్రశంసించారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి