న్యూడిల్లీ: తెలంగాణ అంశంపై మంగళవారం లోకసభను కుదిపేసింది. ప్రాంతాలవారీగా రాష్టానికి చెందిన పార్లమెంటు సభ్యులు విడిపోయి నినాదాలకు దిగారు. జై తెలంగాణ, జై ఆంధ్ర నినాదాలతో లోకసభ అట్టుడికింది. స్పీకర్ పోడియం వద్ద వారు నినాదాలకు దిగడంతో సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. స్పీకర్ మీరా కుమార్ ఎంతగా చెప్పినా వారు వినలేదు.
పార్లమెంటు సభ్యులు రెండుగా విడిపోయి నినాదాలు చేస్తుండడంతో సభా కార్యక్రమాలు స్తంభించాయి. దీంతో స్పీకర్ మీరా కుమార్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. తెలంగాణ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ విషయంలో స్పష్టమైన ప్రకటన చేయాలని వారు కోరారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి