హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు 2014 దాకా ఆగేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సిద్ధంగా ఉంది. ఇది కాంగ్రెసు అధిష్టానానికి కాస్తా ఊరట కలిగించే విషయం. తాము 2014 దాకా ఆగేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెరాస అగ్రనాయకుడొకరు ఒక ఆంగ్ల దినపత్రికతో చెప్పారు. మళ్లీ 2014లో ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికలకు ముందే రాష్ట్రం ఏర్పడితే సంతోషమని, రాష్ట్ర ఏర్పాటు సులభమైంది కాదనే విషయం తమకు తెలుసునని ఆయన చెప్పారు. రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెసు సిద్ధపడినందున ఒత్తిడి తేవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
తెలంగాణ బాణం లాంటిదని, అది విల్లును వదిలిందని తన తండ్రి, తమ పార్టీ నేత కెసిఆర్ స్పష్టం చేశారని తెరాస నాయకుడు, కెసిఆర్ కుమారుడు కెటి రామారావు చెప్పారు. కాంగ్రెసు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సిద్ధపడడం తమకు ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. రాష్ట్ర ఏర్పాటుకు అసెంబ్లీ తీర్మానం అనివార్యమేమీ కాదని ఆయన చెప్పారు. శాసనసభలో తీర్మానం ఆమోదం పొందడం సులభం కాదని, ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తెలంగాణేతర శాసనసభ్యుల సంఖ్య ఎక్కువగా ఉందని, తెలంగాణేతర శాసనసభ్యులంతా ఒక్కటైనందున అది సాధ్యం కాదని ఆయన అన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి