తెలంగాణకు హామీ: త్వరలో ఢిల్లీకి కెసిఆర్

ఢిల్లీ పర్యటన వివరాలను వెల్లడించడానికి జయశంకర్ గానీ వినోద్ కుమార్ గానీ ఇష్టపడడం లేదు. వివరాలను వెల్లడించడం వల్ల నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో మౌనం పాటిస్తున్నట్లు సమాచారం. తెలంగాణపై వెనక్కి తగ్గేది లేదని కాంగ్రెసు అధిష్టానానికి చెందిన నాయకులు వారికి స్పష్టమైన హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. అయితే తెలంగాణ ప్రక్రియలో కాస్తా జాప్యం జరిగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. కాంగ్రెసు అధిష్టానం నేతలు ఇచ్చిన హామీలను సందర్భం చూసి కెసిఆర్ వెల్లడించే అవకాశాలున్నాయని అంటున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కూడా జయశంకర్, వినోద్ కుమార్ కాంగ్రెసు అధిష్టానానికి వివరించినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications