స్టెరాయిడ్లు, బాడీ బిల్డింగ్ సప్లిమెంట్లు వాడే జిమ్ లవర్స్ కు హెచ్చరిక!

ఇటీవల కాలంలో యువతలో ఫిట్నెస్ పిచ్చి బాగా పెరిగిపోయింది. పొద్దున లేస్తే జిమ్ కి వెళ్లడం, జిమ్ లో ఎక్సర్సైజ్ లతోపాటు అక్కడ ట్రైనర్లు ఇచ్చే సప్లిమెంట్స్ తీసుకోవడం, వారిచ్చే స్టెరాయిడ్ లను తీసుకోవడం చేస్తున్నారు. సిక్స్ ప్యాక్ బాడీ మోజులో నీ చేతులారా పాడు చేసుకుంటున్నారు. అయితే తాజాగా ఫిట్నెస్ పిచ్చి తో ఉన్న యువతకు టాస్క్ ఫోర్స్ పోలీసులు, అలాగే వైద్యులు కీలక హెచ్చరిక చేస్తున్నారు.

జిమ్ లకు వెళ్ళే యువతకు భారీ స్థాయిలో స్టెరాయిడ్లు, బాడీ సప్లిమెంట్లు

ఇటీవల హైదరాబాద్లో యువత ఫిట్నెస్ పైన చూపే ఆసక్తిని అక్రమంగా వాడుకొని భారీ స్థాయిలో స్టెరాయిడ్లు, బాడీ సప్లిమెంట్లు విక్రయించే ఒక ముఠాను టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ఆరుగురు జిమ్ ట్రైనర్ లను అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు. వారి వద్ద నుండి పెద్ద ఎత్తున నిషేధిత ఇంజక్షన్లను మందులను స్వాధీనం చేసుకున్నారు.

warning to gym lovers Hyderabad Task Force police arrested six gym trainers alert on steroids

పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుండి ఆన్లైన్ ద్వారా మందులు

ముషీరాబాద్ ప్రాంతంలోని వివిధ జిమ్ లలో పనిచేస్తున్న ఈ ట్రైనర్లు, ఫిట్నెస్ పిచ్చి ఉన్న యువకులను లక్ష్యంగా చేసుకొని మూడు నెలలలోనే సిక్స్ ప్యాక్ యాబ్స్, మంచి కండలు తిరిగిన బాడీ వచ్చేలా చేస్తామని చెప్పి కొన్ని నిషేధిత మందులను వారికి ఇస్తున్నారు. నిందితులు పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుండి ఆన్లైన్ ద్వారా మందులు తెప్పించి, జిమ్ చేస్తున్న యువకులకు ఇస్తున్నారు.

నకిలీ డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లు ఇస్తున్న వారిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో నకిలీ డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లు తయారుచేసి చట్ట వ్యతిరేకంగా వారికి మందులు ఇస్తున్నారు. ఇక ఈ విషయాన్ని గుర్తించిన టాస్క్ఫోర్స్ పోలీసులు ఈ నెట్వర్క్ ను పట్టుకున్నారు. ఈ నెట్వర్క్ లో ఉన్న ప్రధాన డీలర్లను కూడా గుర్తించి త్వరలోనే వాళ్ళ పైన కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

భద్రకాళి సాక్షిగా కాంగ్రెస్ బీఆర్ఎస్ తడిబట్టలతో ప్రమాణాల రభస.. బీజేపీ పసుపునీళ్ళ శుద్ధి
భద్రకాళి సాక్షిగా కాంగ్రెస్ బీఆర్ఎస్ తడిబట్టలతో ప్రమాణాల రభస.. బీజేపీ పసుపునీళ్ళ శుద్ధి

లైంగిక సామర్థ్యం తగ్గుతుందని డాక్టర్లు షాకింగ్ హెచ్చరిక

ఈ క్రమంలో వైద్యనిపుణులు జిమ్ లలో ఇస్తున్న అనాబాలిక్ స్టెరాయిడ్లు వాడడం వల్ల హార్మోన్ల అసమతుల్యత పెరుగుతుందని, లైంగిక సామర్థ్యం తగ్గుతుందని షాకింగ్ విషయాలు వెల్లడించారు. అంతేకాదు అధిక రక్తపోటు, గుండె సమస్యలు, కిడ్నీలు, కాలేయం దెబ్బతినడం, వంధ్యత్వం, క్యాన్సర్ వంటి తీవ్ర ప్రమాదాలు కూడా వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. జిమ్ లలో ట్రైనర్లు మాటలు నమ్మి ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేసుకోవద్దని, మొదటికే మోసం తెచ్చుకోవద్దని హెచ్చరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+