IND vs ENG: టీమిండియా కొంపముంచిన రవి బిష్ణోయ్.. ఇంగ్లండ్ ఘన విజయం!

టీ20 ఫార్మాట్‌లో వరల్డ్ ఛాంపియన్ టీమిండియా పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని టీమిండియా ఓటమిపాలైంది. ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా మాంచెస్టర్ వేదికగా శనివారం జరిగిన రెండో టీ20లో సమష్టిగా విఫలమైన భారత్ 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.

బ్యాటింగ్ వైఫల్యంతో పాటు రవి బిష్ణోయ్ చెత్త బౌలింగ్ టీమిండియా పతనాన్ని శాసించింది. ముఖ్యంగా రవి బిష్ణోయ్ వేసిన 17వ ఓవర్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. ఈ ఒక్క ఓవర్‌లోనే రవి బిష్ణోయ్ రెండు నోబాల్స్‌తో సహా 29 పరుగులు సమర్పించుకున్నాడు.

ఏంటీ.. ఆ స్టార్ హీరోయిన్ 'గే' నా..? ఫైనల్ గా ఓపెన్ అయిన విశ్వంభర బ్యూటీ
ఏంటీ.. ఆ స్టార్ హీరోయిన్ 'గే' నా..? ఫైనల్ గా ఓపెన్ అయిన విశ్వంభర బ్యూటీ

బెతెల్ విధ్వంసం..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 190 పరుగులే చేసింది. అభిషేక్ శర్మ(24 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 43), ఇషాన్ కిషన్(40 బంతుల్లో 6 ఫోర్లతో 49) టాప్ స్కోరర్లుగా నిలవగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(22 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 37), తిలక్ వర్మ(11 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 24 నాటౌట్) దూకుడుగా ఆడారు. ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కరణ్(3/33) మూడు వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్, విల్ జాక్స్, లియామ్ డాసన్ తలో వికెట్ తీసారు. ఇషాన్ కిషన్ స్లో బ్యాటింగ్ టీమిండియా భారీ స్కోర్ అవకాశాలను దెబ్బతీసింది.

IND vs ENG 2nd T20I Jacob Bethell Unbeaten Blaster Seals Chase After Ravi Bishnoi s Expensive Over Costs India
భారత్ కు పాకిస్థాన్ సంచలన సవాల్.. ఫతా-V మిసైల్ తో..!
భారత్ కు పాకిస్థాన్ సంచలన సవాల్.. ఫతా-V మిసైల్ తో..!

అనంతరం ఇంగ్లండ్ 19 ఓవర్లలో 191 పరుగులు చేసి సునాయస విజయాన్ని అందుకుంది. జాకోబ్ బెతెల్(46 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 76 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్ హ్యారీ బ్రూక్(15 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 39), టామ్ బాంటన్(32 బంతుల్లో 6 ఫోర్లతో 39)విలువైన పరుగులు జోడించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(3/40) మూడు వికెట్లు తీయగా.. హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తీ తలో వికెట్ తీసారు. ఈ గెలుపుతో ఐదు టీ20ల సిరీస్‌లో ఇంగ్లండ్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది.

కొంపముంచిన రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్..

191 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ తొలి ఓవర్‌లోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. కానీ హ్యారీ బ్రూక్, జాకోబ్ బెతెల్ జట్టును ఆదుకున్నారు. అర్ష్‌దీప్ సింగ్ వేసిన మూడో ఓవర్‌లో హ్యారీ బ్రూక్ వరుసగా రెండు ఫోర్లు, మూడు సిక్స్‌లు బాది 26 పరుగులు పిండుకున్నాడు.

ఈ ఒక్క ఓవర్ ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ఊపిరి పోయగా.. రవి బిష్ణోయ్ వేసిన 17వ ఓవర్‌ విజయాన్ని అందించింది. ఈ ఓవర్‌లో జాకోబ్ బెతెల్ మూడు సిక్స్‌లు, ఒక ఫోర్‌తో 29 పరుగులు పిండుకున్నాడు. ఈ ఓవర్‌లో రవి బిష్ణోయ్ రెండు నోబాల్స్ వేయడం బెతెల్‌కు కలిసి వచ్చింది. ఈ క్రమంలో అతను 39 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఓవర్‌ను రవి బిష్ణోయ్ కట్టడిగా వేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+