సినిమా టికెట్ ధరల పెంపుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు - 20 శాతం ఇక వారికే..!!

తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సినిమా టికెట్ల ధరల పెంపుకు అనుమతి ఇస్తూనే కొత్త మార్గదర్శకాలు ఖరారు చేసింది. సినిమా టికెట్ల పెంపు అంశం పైన ఎంతో కాలంగా చర్చ సాగుతోంది. ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. దీంతో.. తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో పలువురి అభిప్రాయాలు సేకరించింది. సినీ పరిశ్రమ కార్మికులకు ప్రాధాన్యత పైన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

సినిమా టికెట్ ధరల పెంపు పైన తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. సినిమా టికెట్ ధరలు పెంచుకునే అవకాశం కల్పిస్తూనే అమలు చేయాల్సిన అంశాల పైన స్పష్టత ఇచ్చింది. టికెట్ ధర పెంపు ద్వారా వచ్చే అదనపు ఆదాయంలో నిర్దిష్ట మొత్తాన్ని చలనచిత్ర పరిశ్రమ కార్మికుల సంక్షేమం కోసం కేటాయించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ఆదాయం..కేటాయింపు పైనా క్లారిటీ ఇస్తూ ఉత్తర్వుల్లో మార్గదర్శకాలు ప్రకటించింది. అందులో భాగంగా టికెట్ ధరల పెంపు ద్వారా వచ్చే అదనపు ఆదాయంలో సరిగ్గా 20 శాతాన్ని తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TGFDC) నిర్వహించే ప్రత్యేక సంక్షేమ విరాళంగా తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
కాగా, ఈ నిబంధనను పకడ్బందీగా అమలు చేసే బాధ్యతను చిత్ర నిర్మాణ సంస్థలకే అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో క్లారిటీ ఇచ్చింది.

Telangana Govt Approves Cinema Ticket Hike Mandates 20percent Contribution for Film Workers

ఇక అద‌న‌పు ఆదాయంపై వర్తించే ఈ 20 శాతం వాటాను ఎగ్జిబిటర్ల నుంచి నేరుగా నిర్మాతలే వసూలు చేయాలని నిర్దేవించింది. ఆ విధంగా వసూలు చేసిన మొత్తాన్ని తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఖాతాకు లేదా TGFDC ఆధ్వర్యంలో నిర్వహించే అధికారిక ఖాతాకు జమ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఇటీవ‌ల వ‌చ్చిన‌ 'అఖండ-2', 'ది రాజాసాబ్', 'మన శంకర వర ప్రసాద్ గారు పండుగకు వస్తున్నారు', అలాగే 'పెద్ది' సినిమాలకు టికెట్ ధ‌ర‌ల‌ను పెంచుకునేందుకు అనుమ‌తినివ్వ‌గా ఈ సినిమాలకు సంబంధించిన‌ నిర్మాణ సంస్థలైన 14 రీల్స్ ప్లస్ ఎల్‌ఎల్‌పి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, షైన్ స్క్రీన్స్ ఇండియా ఎల్‌ఎల్‌పి, మరియు వృద్ధి సినిమాస్ ఎల్‌ఎల్‌పిలకు రాష్ట్ర హోం శాఖ ప్రత్యేకంగా లేఖలు పంపింది. టికెట్ ధరల పెంపు ద్వారా సమకూరే అదనపు రాబడిలో 20% మొత్తాన్ని సంక్షేమ నిధికి మళ్లించే ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని, తదనుగుణంగా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయా నిర్మాతలకు ప్రభుత్వం సూచించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+