100 రోజుల్లో 185 కేసులు.. హైదరాబాద్ లో ఫుడ్ కల్తీపై హెచ్- ఫాస్ట్ పంజా

హైదరాబాద్ నగరం అనగానే చాలా మందికి ఇక్కడి చారిత్రక ప్రదేశాలు, టెక్ సంస్థలు, ఫార్మా దిగ్గజ కంపెనీలతోపాటు బిర్యానీ, స్ట్రీట్ ఫుడ్ కూడా గుర్తుకువస్తుంది. మిని ఇండియాగా పేరుగాంచిన హైదరాబాద్ లో దేశంలోని రకరకాల ప్రాంతాలకు చెందిన వంటలు, స్ట్రీట్ ఫుడ్ ఇక్కడ లభిస్తుంటుంది. కానీ ఇటీవలికాలంలో ఆహారంలో కల్తీ విపరీతంగా పెరిగిపోతుంది. పసిబిడ్డలు తాగే పాల నుంచి తినే అన్నం వరకు ప్రతి దాంట్లో కల్తీ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు కొందరు కేటుగాళ్లు. దాంతో 'హెచ్-ఫాస్ట్' పేరుతో రంగంలోకి దిగిన స్పెషల్ ఫోర్స్ కేవలం 100 రోజుల్లోనే రికార్డు స్థాయిలో 185 కేసులు నమోదు చేసి కల్తీ సామ్రాజ్యం పునాదులు కదిలించింది. ఈ దాడుల్లో మొత్తం 121 టన్నుల కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఈ 100 రోజుల్లో నగరవ్యాప్తంగా వివిధ జోన్ల పరిధిలో మొత్తం 185 కేసులు నమోదు చేసి, సుమారు 121.87 టన్నుల ప్రమాదకరమైన కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. జోన్ల వారీగా వివరాలు పరిశీలిస్తే.. అత్యధికంగా రాజేంద్రనగర్ జోన్‌ లో 55 కేసులు నమోదు కాగా, గోల్కొండ జోన్‌లో 44, సికింద్రాబాద్ జోన్‌ లో 35, చార్మినార్ జోన్‌లో 21, శంషాబాద్ జోన్‌ లో 13, జూబ్లీహిల్స్ జోన్‌ లో 12, ఖైరతాబాద్ జోన్‌ లో 5 కేసులు నమోదైనట్లు తెలిపారు.

కాదేదీ నకిలీకిఅనర్హం అన్నట్లు.. నిత్యం వాడే కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌కు సంబంధించి 27 కేసుల్లో ఏకంగా 27వేల కేజీల నకిలీ నిల్వలను పోలీసులు పట్టుకున్నారు. అలాగే కృత్రిమ రసాయనాలతో పండ్లను మగ్గబెట్టే 16 ముఠాల గుట్టురట్టు చేసి 25,845 కేజీల పండ్లను సీజ్ చేశారు. ఇక చికెన్ వ్యర్థాల విక్రయాలకు సంబంధించిన 6 కేసుల్లో ఏకంగా 60 టన్నుల కంటే ఎక్కువ చికెన్‌ ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. వీటితోపాటు నిల్వ పచ్చళ్లు, కల్తీ కోవా, నకిలీ టీ పొడి, కల్తీ క్రీమ్, కల్తీ నెయ్యి , ఐస్ క్రీములు, బిస్కెట్లు, ఆర్ఓ వాటర్ ప్లాంట్లు, జంక్ ఫుడ్స్, పనీర్ వంటి అనేక పదార్థాల్లో కల్తీ జరిగినట్లు ధ్రువీకరించారు.

Hyderabad H-FAST Takes Strict Action 185 Food Adulteration Cases in Just 100 Days H-FAST Hyderabad

ఇక హెచ్-ఫాస్ట్ విభాగం ఏర్పాటుతో ప్రజల నుంచి ప్రతి రోజు సగటున 15 వరకు కల్తీ ఆహార సమాచారం అందుతోందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అలాగే ఈ మహమ్మారిని అరికట్టడంలో పౌరుల భాగస్వామ్యం అత్యంత కీలకమని తెలిపారు. ఆహార కల్తీ జరిగినట్టు తెలిస్తే వెంటనే పోలీసులు, అధికారులకు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+