తెలంగాణ ప్రజలకు నేర్పిస్తా: మోహన్ బాబు

ఉద్యమాలను శాంతియుతంగా కొనసాగించాలని ఆయన ప్రజలను కోరారు. ఆస్తులను ధ్వంసం చేయవద్దని ఆయన సూచించారు. ప్రాణత్యాగం చేయవద్దని ఆయన హితవు చెప్పారు. తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా అన్ని ప్రాంతాలు మనవేనని ఆయన అన్నారు. విశాలాంధ్ర, ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ ప్రజలకు తెలియదని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలకు ఆ విషయాన్ని తెలియజేస్తానని ఆయన అన్నారు. కాంగ్రెసు ప్రభుత్వ చర్య వల్ల రాష్ట్రం యుద్ధభూమిలా మారిందని ఆయన విమర్శించారు. దుష్ట రాజకీయాల వల్ల విడిపోయే పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు. రాయలసీమ కూడా వెనకబడి ఉందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు తమ సమస్యలు చెప్తే పరిష్కరించుకోవచ్చునని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications