తెలంగాణ హోరు: లోకసభ వాయిదా

తెలుగుదేశం తెలంగాణ పార్లమెంటు సభ్యుడు మందా జగన్నాథం జై తెలంగాణ ప్లకార్డుతో స్పీకర్ పోడియం వద్ద నించున్నారు. మాట్లాడడానికి జీరో అవర్ లో అవకాశం ఇస్తానని చెప్పినా తెలుగుదేశం సభ్యులు వినలేదు. ప్లకార్డులు ప్రదర్శించవద్దని, సభలో ఇటువంటి సంప్రదాయం ప్రవేశవెట్టవద్దని మీరా కుమార్ సూచించారు. సభ పవిత్రతను కాపాడాలని, క్రమశిక్షణతో మెలగాలని కూడా ఆమె చెప్పారు. అయినా సభ సద్దుమణగకపోవడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. తిరిగి సమావేశమైన తర్వాత సభ ప్రశాంతంగా సాగింది.












Click it and Unblock the Notifications