సమైక్యాంధ్ర తెలుగుదేశం విశాఖ బంద్ నేడు

ప్రభుత్వ యంత్రాంగాన్ని స్తంభింపజేయడమే లక్ష్యంగా ఈ బంద్‌ను పాటిస్తున్నట్టు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్సీ దాడి వీరభద్రరావు గురువారం నగరంలోని ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. కొన్ని రోజులుగా వరుసగా బంద్‌లు పాటిస్తున్న దృష్ట్యా బంద్ పరిధిలోకి కేవలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాలయాలను మాత్రమే తీసుకొచ్చామన్నారు.
సమైక్యాంధ్ర నినాదంతో శుక్రవారం జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల బంద్‌కు తెలుగుదేశం పిలుపునిచ్చింది. ప్రభుత్వ పాలన స్తంభింప చేయడమే లక్ష్యంగా అన్ని కార్యాలయాలతోపాటు వాణిజ్య బ్యాంకుల లావాదేవీలను అడ్డుకుంటామని పార్టీ సీనియర్ నేత దాడి వీరభద్రరావు ప్రకటించారు.
గురువారం పార్టీ కార్యాలయంలో నగర నేతలు మజ్జి సుందరంపాత్రుడు, భరణికాన రామారావు, కోన తాతారావు, నల్లూరి భాస్కరరావు, గుడివాడ నాగమణి, వాసుపల్లి గణేష్‌కుమార్, నడింపల్లి ఆంజనేయరాజులతో చర్చించారు.












Click it and Unblock the Notifications