లగడపాటి పరిగెత్తుకొచ్చారన్నారు: సిఎం

చట్టానికి సామాన్యులు, ప్రజాప్రతినిధులు వేరు కాదని ఆయన స్పష్టం చేశారు. పోలీసులు కుమ్మక్కు కావడం వల్లనే రాజగోపాల్ ఇలా వచ్చేశారని రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రాజగోపాల్ అదృశ్యంపై విచారణ జరిపిస్తున్నామని ఆయన చెప్పారు. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కు రాష్ట్ర పరిస్థితులు తెలుసునని ఆయన చెప్పారు. తెలంగాణవాదులు, సమైక్యవాదులు ఎవరి వాదనలు వారు పార్టీ అధిష్టానానికి వినిపించారని, అందువల్ల వారు సంయమనం పాటించి వేచి చూస్తే మంచిదని ఆయన అన్నారు. పోలీసులు సంమనం పాటించాలంటే చూస్తూ ఊరుకోవడం కాదని ఆయన అన్నారు. ఆందోళన వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభావం పడుతోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications