వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాజీనామాకు కాంగ్రెసు ఎంపీల నిర్ణయం

తెలంగాణపై చిదంబరం చేసిన ప్రకటనలో రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు గడువు ఏదీ పెట్టలేదని, అందుకు సంబధించిన కార్యక్రమం కూడా ఏదీ లేదని ఆయన చెప్పారు. విస్తృత ప్రాతిపదికపై చర్చలు జరుపుతామని చెప్పారే తప్ప అందుకు సంబంధించిన గడువు, కార్యక్రమం లేకపోవడంతో అనుమాలు తలెత్తుతున్నాయని ఆయన అన్నారు. ప్రజాభిప్రాయం మేరకు తాము రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు నల్లగొండ లోకసభ సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు. తాము కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి వద్దకు వెళ్తున్నామని, ప్రజాభిప్రాయం మేరకు జైపాల్ రెడ్డి కూడా రాజీనామా చేస్తారని ఆశిస్తున్నామని ఆయన చెప్పారు. తెలుగుదేశం ఏకైక లోకసభ్యుడు రమేష్ రాథోడ్ ఇప్పటికే రాజీనామా చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన ఇద్దరు లోకసభ సభ్యులు కూడా రాజీనామా చేశారు.