ఓటీటీలోకి రూరల్‌ కామెడీ డ్రామా.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..?

ఇటీవలికాలంలో చిన్న సినిమాలదే హవా నడుస్తోంది. భారీ బడ్జెట్ సినిమాలపై ప్రేక్షకులు ఎన్నో అంచనాలు పెట్టుకుంటున్నారు. అయితే రిలీజ్ అయ్యాక అవి తీవ్రంగా నిరాశపరుస్తున్నాయి. ఇదే సమయంలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. గతేడాది రాజు వెడ్స్ రాంబాయి, లిటిల్ హార్ట్స్ లాంటి చిన్న సినిమాలు ప్రేక్షకుల్ని అలరించాయి. అయితే ఈ ఏడాది రిలీజైన చిన్న సినిమాల్లో తిమ్మరాజుపల్లి టీవీ ఒకటి. ఈ మూవీలో నటించిన వారంతా కొత్తవారే కావడం విశేషం. కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన తిమ్మరాజుపల్లి టీవీ సినిమాకు కలెక్షన్స్ కు భారీగానే వచ్చాయి.

తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధం అవుతోంది. తిమ్మరాజుపల్లి టీవీ సినిమా మే 15వ తేదీ నుంచి ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఆహా పోస్టర్‌ విడుదల చేసింది. ఈమేరకు 'కనిపించకుండా పోయిన ఒక టీవీ. నిందకు గురైన ఒక దొంగ. నిజం కోసం ఎదురుచూస్తున్న ఒక గ్రామం.' అంటూ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రంతోనే వి మునిరాజు దర్శకుడిగా పరిచయం అయ్యారు.

Telugu Rural Comedy-Drama Thimmaraju Palli TV Arrives on OTT Streaming on Aha from May 15 Telugu

తొలి చిత్రం అయినా ఎమోషన్స్, గ్రామీణ వాతావరణాన్ని చక్కగా స్క్రీన్ పై చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. ఇక ఈ సినిమా ద్వారా దాదాపు 40 మంది నటుల్ని తెలుగు తెరకు పరిచయం చేశారు కిరణ్ అబ్బవరం. అలాగే ఈ మూవీలో సాయి తేజ్, వేద జలంధర్, ప్రదీప్ కొట్టె, అమ్మ రమేష్, స్వాతి కరిమిరెడ్డి, లతీష్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. థియేటర్లలో మిస్ అయినవాళ్లు ఓటీటీలో ఈ మూవీని చూడండి..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+