కైలాస మానస సరోవర్ యాత్ర ఎలా వెళ్లాలి..? బడ్జెట్ ధరలో.. !

కైలాష్ పర్వతం అంటే టిబెట్ లోని పరమ శివుని నివాసంగా భావిస్తారు. ప్రతి హిందువు తన జీవితంలో ఒక్కసారైనా ఈ యాత్ర చేయాలని అనుకుంటాడు. 2026 లో ఈ యాత్ర మే నుంచి సెప్టెంబర్ వరకు జరుగుతుంది. ఈ యాత్ర నేపాల్ లేదా టిబెట్ మార్గాల మధ్య సాగుతుంది. కైలాస మానస సరోవర్ యాత్రకు సుమారు 10 నుంచి 15 రోజుల పాటు సమయం పడుతుంది. మరోవైపు కైలాస మాన‌స స‌రోవ‌ర్ యాత్రకు ప‌ర్యాట‌కుల నుంచి మంచి స్పంద‌న వస్తోంది. ఏటా యాత్ర‌లో పాల్గొనే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వ‌స్తోంది. ఈ సారి యాత్ర ఫీజు రూ.35 వేల వ‌ర‌కు పెరిగింది.

కైలాష్ పర్వతం అంటే కేవలం ఒక ధార్మిక స్థలం మాత్రమే కాదు. చైతన్యం, విశ్వ శక్తికి కేంద్రంగా పరిగణిస్తారు. హిందూ, బౌద్ధ, జైన , టిబెటన్ సంప్రదాయాలలో ఈ ప్రాంతాన్ని సృష్టి హృదయంగా పేర్కొన్నారు. ముఖ్యంగా 2026 సంవత్సరం ఎంతో ప్రత్యేకమైనదిగా భావిస్తున్నారు. ఈ సంవత్సరంలో కైలాష్ పర్వం నుంచి వెలువడే సానుకూల శక్తి అనేక రెట్లు పెరుగుతుందని నమ్మకం. దీనివల్ల అక్కడ చేసే ధ్యానం, సాధన విశేష ఫలితాలను ఇస్తాయి.

ఇక కైలాస మానస సరోవర్ యాత్రకు భారీగానే ఖర్చు కానుంది. ప్రతి పౌరుడి నుంచి రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు ఖర్చు చేయాల్సి రావచ్చని సమాచారం. అలాగే ప్రయాణానికి కావాల్సిన అన్ని రకాల ఫీజులు దాదాపు రెట్టింపు అయ్యాయి. ఇదే సమయంలో ఈ యాత్రకు వెళ్లే పర్యటకులపై చైనా అనేకమైన కఠిన నిబంధనలు విధించింది. కొత్త రూల్స్‌, పెరిగిన ఛార్జీల నేపథ్యంలో ఒక్కో పర్యాటకుడికి రూ.2 లక్షల నుంచి రూ.3లక్షల వరకు ఖర్చు కావచ్చని అంచనా.

Kailash Mansarovar Yatra 2026 Complete Guide to Routes Costs Permits Online Registration Details

మానస్‌ సరోవర్‌ యాత్రకు మూడు మార్గాలు ఉన్నాయి. ప్రయాణానికి దాదాపు 10 రోజుల నుంచి గరిష్ఠంగా 21 రోజుల సమయం పడుతుంది. అలాగే సముద్ర మట్టానికి కైలాష్ పర్వతం 22వేల అడుగుల ఎత్తులో ఉంటుంది. ఉత్తరా ఖండ్‌ లోని లిపు లేఖ్ పాస్ నుంచి 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే సిక్కింలోని నాతులా నుంచి 802 కిలోమీటర్లు ఉంది. ఇక నేపాల్ రాజధాని ఖాట్మండు నుంచి దాదాపు 500 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక ఈ యాత్ర ఏటా మే నుంచి సెప్టెంబర్ వరకు ఉంటుంది. యాత్రకు ముందు పర్యటకులకు దిల్లీలో మూడు రోజుల పాటు ప్రత్యేకమైన శిక్షణ అందిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+