తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుపై లోక్ భవన్ కీలక ప్రకటన..!!
తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు పై సస్పెన్స్ కొనసాగుతోంది. గవర్నర్ ను రెండో సారి విజయ్ కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. 15 రోజుల్లోగా తాను అసెంబ్లీలో బలం నిరూపించుకుంటానని చెప్పారు. ఇదే సమయంలో గవర్నర్ తన ఆలోచన ఏంటో స్పష్టం చేసారు. ఈ సమయంలో విజయ్ కు మద్దతుగా పలువురు ముందుకు వస్తున్నారు. గవర్నర్ నిర్ణయం పైన అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో... ఈ పరిణామాల వేళ గవర్నర్ కార్యాలయం కీలక ప్రకటన విడుదల చేసింది. అసలు అంశం తేల్చి చెప్పింది.
విజయ్ ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్ తో చర్చించారు. తొలి విడత సమావేశంలో తనకు ఉన్న మద్దతు గురించి వివరించారు. ప్రస్తుతం కాంగ్రెస్ తో కలిపితే 112 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉంది. కాగా, ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 118 మంది మద్దతు ఉండాలి. దీంతో.. గవర్నర్ తో విజయ్ తాను అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుంటానని.. ఇందు కోసం 15 రోజులు సమయం ఇవ్వాలని కోరారు. అయితే విజయ్ వివరణతో గవర్నర్ సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. విజయ్ రెండు సీట్లలో గెలవడంతో ఒక సీటును వదులుకోవడం అనివార్యం.

దీంతో టీవీకే చేతిలో 107 మంది సభ్యుల బలం మాత్రమే ఉన్నట్టయింది. కాంగ్రెస్ బలం కూడా కలిపితే టీవీకే బల నిరూపణకు మరో 6 మంది ఎమ్మెల్యేలు అవసరం. ఏఐడీఎంకే 47 సీట్లలో గెలవగా, అందులోని ఒకవర్గం టీవీకే వైపు మొగ్గుచూపుతోంది. పీఎంకే-4, ఐయూఎంఎల్-2, సీపీఐ-2, సీపీఎం-2, డీఎండీకే, ఐఎంఎంకే చెరో సీటు కలిగి ఉన్నాయి. టీవీకేకు చిన్న పార్టీల నుంచి మద్దతు లభించే అవకాశాలు బలంగానే ఉన్నాయి. కాగా, గవర్నర్ మెజార్టీకి కావాల్సిన బలంతో రావాలని సూచించారు.
తేల్చి చెప్పిన గవర్నర్
దీంతో.. గవర్నర్ చెబుతున్న అంశాల పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ముందుగా ప్రమాణ స్వీకారం చేయించి... సభలోనే మెజార్టీ నిరూపణకు అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఈ సమయంలో గవర్నర్ కార్యాలయం లోక్ భవన్ కీలక ప్రకటన విడుదల చేసింది. గవర్నర్ ఆహ్వానం మేరకు విజయ్ లోక్ భవన్ కు ఈ రోజు ఉదయం వచ్చారని వెల్లడించింది. అధిక సీట్లు సాధించిన పార్టీకే టీవీకే కే అవకాశం ఉంటుందని స్పష్టం చేసారు. అయితే, మెజార్టీ ఏర్పాటుకు అవసరమైన 118 ఎమ్మెల్యే మద్దతు పైన స్పష్టత కావాలని చెప్పినట్లు వివరించింది. ప్రభుత్వం ఏర్పాటు కోసం అవసరమైన పూర్తి మెజారిటీ లేదని.. మెజారిటీ ఫిగర్‌తో రావాలని విజయ్ను కోరినట్టు లోక్‌భవన్ ప్రకటన లో స్పష్టం చేసారు. ఈ మేరకు విజయ్‌తో భేటీ తర్వాత ప్రెస్‌నోట్ తమిళనాడు లోక్‌భవన్ ప్రకటన విడుదల చేసింది.













Click it and Unblock the Notifications