తెలంగాణపై వెనక్కి: 48 గంటల బంద్

Chidambaram
న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి పోయింది. దీంతో తెలగాణలో 48 గంటలకు బంద్ బుధవారం రాత్రి నుంచే ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వెనక్కి తీసుకుంటూ కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం బుధవారం రాత్రి ఏడున్నర గంటలకు ప్రకటన చేశారు. ఆ ప్రకటన వెలువడిన వెంటనే తెలంగాణలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. పలు చోట్ల విధ్వంసకరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నెల 9వ తేదీన తెలంగాణకు జైకొడుతూ ప్రకటన చేసిన తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు మారాయని, దాంతో రాష్ట్ర విభజనపై అన్ని రాజకీయ పార్టీలు, గ్రూపులతో విస్తృత స్థాయి చర్చలు జరపాల్సిన అవసరం ఉందని చిదంబరం ప్రకటించారు. విస్తృత స్థాయి చర్చల్లో అందరినీ భాగస్వాములను చేస్తామని ఆయన చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుందని ఈ నెల 9వ తేదీన ప్రకటన చేసిన తర్వాత పార్టీలు తమ విధానాలు మార్చుకున్నాయని, ఈ నెల 7వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశంలో వ్యక్తం చేసిన ఏకాభిప్రాయం నుంచి పార్టీలు వెనక్కి తగ్గాయని, ఈ పరిస్థితిలో విస్తృత స్తాయి చర్చించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. రాష్ట్రంలో శాంతి సామరస్యాలను కాపాడాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ఈ ప్రకటన వెలువడిన వెంటనే తెలంగాణలో ఆందోళనకారులు 48 గంటల బంద్ కు పిలుపునిచ్చారు. హైదరాబాదు సహా పలు జిల్లాల్లో రోడ్లను దిగ్బంధించారు. విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారు. తెలంగాణ అంతటా రాష్ట్ర ప్రభుత్వం 144, 30 సెక్షన్లు విధించి పోలీసు, భద్రతా బలగాలను దింపారు. విశ్వవిద్యాలయాల్లోకి భారీగా పోలీసులను దింపారు. తీవ్ర అణచివేత చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+